తొలిసారిగి ఇక్కడ కరోనా కేసులు నమోదు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రాన్స్‌ వంటి కొన్ని దేశాల్లో దీని ఉద్ధృతి తిరిగి ప్రారంభం అవుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్లు వాడకం

Published : 30 Oct 2020 01:13 IST

మజురో: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రాన్స్‌ వంటి కొన్ని దేశాల్లో దీని ఉద్ధృతి తిరిగి ప్రారంభం అవుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్లు వాడకం వైరస్‌ను కట్టడి చేస్తున్నా.. టీకా వచ్చే వరకూ అజాగ్రత్త వహిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ కొన్ని చిన్న దేశాలు, దీవులు కొవిడ్‌ వైరస్‌ దూరంగా ఉన్నాయి. అలాంటి వాటిలో సమోవా, టోంగా, నౌరు, మార్షల్‌ దీవులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వైరస్‌ను దరిచేరనివ్వలేదు.  

మార్షల్‌ దీవుల్లో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి దాడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ కరోనా రహితంగా ఉన్న ఈ దీవుల్లో తాజా కేసుల నమోదవటం గమనార్హం. ఈ దీవుల్లోని ఖ్వజాలిన్‌ అటోల్‌ ప్రాంతంలోని యూఎస్‌ మిలటరీ బేస్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీళ్లిద్దరూ ఒకే విమానంలో ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు అక్కడి అధికారులు నిర్ధరించారు. అక్టోబరు 27న ఈ ఇద్దరు వ్యక్తులు యూఎస్‌ఏలోని హవాయి ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీళ్ల ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి చెందలేదని వివరించిన అధికారులు కరోనా కట్టడికి కొత్త నిబంధనలేమీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని