కరోనాపై చైతన్యానికి.. మాస్క్‌ గణపతి!

కరోనా భయం వెంటాడుతున్న వేళ ప్రజలు ఈసారి వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే జరుపుకొంటున్నారు. అయితే, నేటి పరిస్థితులకు తగినట్టుగా.......

Updated : 22 Aug 2020 22:38 IST

విశాఖ: కరోనా భయం వెంటాడుతున్న వేళ ప్రజలు ఈసారి వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే జరుపుకొంటున్నారు. అయితే, నేటి పరిస్థితులకు తగినట్టుగా కొందరు ఔత్సాహికులు ప్రత్యేక ఆకృతుల్లో గణనాథుడి విగ్రహాలు తయారుచేస్తున్నారు. విశాఖలో అయితే కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుచేసిన మాస్క్‌ వినాయకుడి విగ్రహం  విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని తాటిచెట్లపాలెంలో హరిప్రసాద్‌ అనే వ్యక్తి ఈ ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేశారు. ఏటా వినాయక చవితికి సమాజానికి ఏదోఒక సందేశం ఇచ్చేలా వివిధ రూపాల్లో విగ్రహం తయారు చేయించడం ఆయన ప్రత్యేకత. అయితే,  ఈ ఏడాది కరోనా నేపథ్యంలో కోల్‌కతా నుంచి బొమ్మలు తయారుచేసేవారు రాకపోవడంతో తానే మట్టితో బొమ్మను తయారు చేసి పైన 300 మాస్క్‌లతో అలంకరణ చేశాడు. గణనాథుడి చేతికి తొడుగులు, ముఖానికి షీల్డ్‌ను ఏర్పాటు చేశాడు.

ఈ విగ్రహం తయారీకి 20 రోజుల సమయం పట్టింది. రూ.5వేల ఖర్చుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని తన ఇంటి ముందు ఏర్పాటు చేశాడు. చూసేందుకు వచ్చినవారికి ప్రసాదానికి బదులుగా మాస్క్‌లు పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకుడు తెలిపాడు. మాస్క్‌ ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక బోర్డును సైతం ఏర్పాటు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని