కాలేజీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మద్యాహ్నానికి తిరిగి వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బాటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్ అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్‌కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు