మంత్రి హరీశ్‌.. క్రికెటర్‌ అవతారం

రాజకీయాల్లో నిరంతరం తీరికలేకుండా ఉండే రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్రికెటర్‌ అవతారం ఎత్తారు. ఇన్నిరోజులు వరుసగా ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ఆయన తాజాగా క్రికెట్‌ ఆడి సేదతీరారు. హరీశ్‌ సారథ్యంలోని సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌కు

Published : 03 Dec 2020 01:24 IST

సిద్దిపేట టౌన్‌: రాజకీయాల్లో నిరంతరం తీరికలేకుండా ఉండే రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్రికెటర్‌ అవతారం ఎత్తారు. ఇన్నిరోజులు వరుసగా ఎన్నికల ప్రచారంలో తలమునకలైన ఆయన తాజాగా క్రికెట్‌ ఆడి సేదతీరారు. హరీశ్‌ సారథ్యంలోని సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్‌ ఆసుపత్రి జట్ల మధ్య బుధవారం రాత్రి స్నేహపూర్వక టీ20 మ్యాచ్‌ జరిగింది. దీనికి సిద్దిపేట లఘు క్రీడామైదానం వేదికైంది. ఈ మ్యాచ్‌లో సిద్దిపేట జట్టు 15 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన సిద్దిపేట నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిద్దిపేట జట్టు బ్యాట్స్‌మెన్‌ బౌండరీల వరద పారించారు. ఆ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి హరీశ్‌రావు క్రీజులో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించారు. కేవలం 12బంతుల్లోనే 3ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశారు. క్రీజులో ఉన్నంత సేపూ మెరుపు బ్యాటింగ్‌తో తోటి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. 

తీవ్ర ఉత్కంఠ..
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెడికవర్‌ జట్టు 19.5 ఓవర్లలో 150 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే సిద్దిపేటనే విజయం వరించింది. ఈ ఆట చూసిన ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యారు. కాగా సిద్దిపేట జట్టులో పోలీస్‌ కమిషనర్ జోయల్‌డేవిస్‌ సభ్యుడిగా ఉన్నారు.   


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని