ఎంసెట్ ఈ తేదీల్లోనే అనుకుంటున్నాం: సబితా

ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా.....

Published : 11 Aug 2020 02:19 IST

ఈ నెల 20 నుంచి విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సోమవారం ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌  9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 

హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎంసెట్‌ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ కరోనా విజృంభణతో అవన్నీ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, పరీక్షలు ఎప్పుడు  జరుగుతాయో అనే ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని