‘తక్కువ ఖర్చుతో అద్భుత సినిమాలు తీయొచ్చు’

దేశవ్యాప్తంగా సినిమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 24 Aug 2020 18:00 IST

సినీ నిర్మాతలతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సినిమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్‌ రామారావు, ఆది శేషగిరిరావుతో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమావేశమై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో దట్టమైన అడవులు, రిజర్వాయర్లు, జలపాతాలు, దేవాలయాలు ఉన్నాయని.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన సినిమాలు తీయొచ్చని చెప్పారు. 
‘‘ఇతర దేశాల కన్నా అంత్యంత చరిత్రాత్మకమైన ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. సినిమా చిత్రీకరణలతో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలాంటి ప్రాంతీయ బేధాలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా చిత్రీకరణకు నిర్మాతలు ముందుకొచ్చారు. సినిమాల చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వారం రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించవచ్చో ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను నిర్మాతలు సందర్శిస్తారు. అనంతరం ప్రణాళిక రూపొందించాక సీఎం కేసీఆర్‌ను కలుస్తాం’’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని