ఆస్తి వివరాలను నమోదు చేసుకున్న మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయన ఆస్తుల వివరాలను...

Published : 13 Oct 2020 16:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయన ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తలసాని ఇంటికి సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు వెళ్లి మంత్రి ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఎవరి ఆస్తులు వారికి దక్కేందుకే ఆన్‌లైన్‌లో నమోదు ఏర్పాటు చేసినట్లు తలసాని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని