భవిష్యత్‌లో మళ్లీ ఇలా జరగదు: తలసాని

ఉస్మానియా ఆస్పత్రిపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Published : 16 Jul 2020 18:49 IST

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఉస్మానియా ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని మార్గం చూపించాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిద్దామంటే గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. అప్పుడు ఉస్మానియా, ఇప్పుడు సచివాలయానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. భాజపా నేతలది హైదరాబాద్‌లో ఒక డ్రామా..దిల్లీలో మరో డ్రామా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడం వల్లే గతంలో ఉస్మానియా భవనాల నిర్మాణం ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నియంత్రణలోనే ప్రైవేటు ఆస్పత్రులు ఉంటాయని చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని