Published : 12 Aug 2020 12:22 IST

నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఆయన ట్విటర్‌ వేదికగా ఉదహరించారు. బెంగళూరులో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుల విషయంలో మంగళవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 60 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 147 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనను ఉదహరిస్తూ ‘‘ఒక బాధ్యతారహిత పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో. అవాస్తవాలు, అమర్యాదలకు పాల్పడే పోస్టుల పట్ల నెటిజన్లు జాగ్రత్త వహించాలి. సామాజిక మాధ్యమాలను సంఘవ్యతిరేక శక్తులకు వేదికగా మార్చరాదు’’ అని ట్వీట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను ఈ మేరకు పోస్టు చేశారు. 

ఇదీ చదవండి..
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసంపై రాళ్లదాడి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని