అంతరిక్షం నుంచి ఓటు హక్కు

అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ఓటును అంతరిక్షం వేయనున్నట్లు నాసా మహిళా వ్యోమగామి కేట్‌ రూబిన్‌ తెలిపారు. భూమికి 200 మైళ్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్‌ కేంద్రానికి........

Updated : 27 Feb 2024 14:18 IST

వాషింగ్టన్‌ : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ఓటును అంతరిక్షం వేయనున్నట్లు నాసా మహిళా వ్యోమగామి కేట్‌ రూబిన్‌ తెలిపారు. భూమికి 200 మైళ్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్‌ కేంద్రానికి అక్టోబరులో పయనమవుతున్న కేట్‌ ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటును అక్కడి నుంచి వేస్తానని ఆమె వివరించారు. సమాజంలో ఓటుకు చాలా విలువ ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అంతరిక్షం నుంచి ఓటు వేయడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వ్యోమగాములు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ ద్వారా వారు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని