హాథ్రాస్‌ కేసులో ఎన్సీడబ్ల్యూ నోటీసులు  

హాథ్రాస్‌లో జరిగిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకుడికి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. యూపీలోని హాథ్రాస్‌లో 19 ఏళ్ల యువతిపై గత నెల దాడి

Published : 08 Oct 2020 01:50 IST

దిల్లీ : హాథ్రాస్‌లో జరిగిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకుడికి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. యూపీలోని బారాబంకీ చెందిన భాజపా నాయకుడు రంజిత్‌ శ్రీవాస్తవ ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అమాయకులని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్సీడబ్ల్యూ దృష్టికి రావడంతో ఆ నాయకుడి మాటలను ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్టోబరు 26వ తేదీలోపు తమ వద్దకు వచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడానికి యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని