నూతన విద్యా విధానంతో  విశ్వగురువుగా భారత్‌

దిల్లీ: భారత్‌లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారత్‌ను విశ్వగురువుగా నిలుపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్‌ఐటీ అగర్తలలో మంగళవారం జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వర్చువల్‌ విధానంలో హాజరై ప్రసంగించారు. 

Published : 18 Nov 2020 00:42 IST

ఎన్‌ఐటీ అగర్తల స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి

దిల్లీ: భారత్‌లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారత్‌ను విశ్వగురువుగా నిలుపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్‌ఐటీ అగర్తలలో మంగళవారం జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వర్చువల్‌ విధానంలో హాజరై ప్రసంగించారు.  ఈ నూతన విద్యా విధానం క్రమశిక్షణతో కూడిన పూర్తిస్థాయి విద్యను, విలువలను అందిస్తుందన్నారు.  ‘‘ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు జ్ఞానార్జనకు కేంద్రాలుగా ఉండాలి.  విద్యార్థులు, పరిశోధకులు నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి.  విద్యా బోధనలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలి.  మనం నేర్చుకున్న దానిని ఎప్పుడైతే జీవితాల్లో అనుసరిస్తామో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది.’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.   భారతీయ ఔన్నత్యాన్ని తెలిపేలా విద్యార్థులంతా వసుధైక కుటుంబంలా ఉండాలన్నారు. పంచుకోవడంలోనే సంతోషం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు.  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకటించిన వంద ఉత్తమ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో స్థానం సాధించినందుకు ఎన్‌ఐటీ అగర్తలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని