మూసీనది ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ

మూసీనది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం....

Published : 27 Sep 2020 13:48 IST

హైదరాబాద్‌: మూసీనది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అప్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, హైదరాబాద్‌ కలెక్టర్‌ సభ్యులుగా ఉంటారని ఎన్జీటీ ఆదేశాల్లో పేర్కొంది. నెలరోజుల్లోగా పర్యవేక్షక కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని, నాలుగు నెలల్లో తొలి నివేదికను అందజేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఏడాదిలోగా మూసీనది ప్రక్షాళన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా ఎన్జీటీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మూసీనది ప్రక్షాళనకు అంచనా వ్యయం కూడా అధికంగా వేసినట్లు గుర్తించామని తెలిపింది. సాధారణం కంటే 20 రెట్లు అధికంగా అంచనా వేశారని అభిప్రాయపడింది. పాషా పిటిషన్‌పై లిఖితపూర్వక ఆదేశాలను ఎన్జీటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని