మొబైల్‌ యాప్‌ ద్వారా వార్షిక పరీక్షలు!

అక్టోబర్‌ 1 నుంచి జరిగే ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు నాగ్‌పూర్‌ యూనివర్సిటీ ప్రకటించింది.

Published : 28 Sep 2020 23:15 IST

నాగ్‌పూర్‌ యూనివర్సిటీ ఏర్పాట్లు

నాగ్‌పూర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో విద్యాసంస్థలకు పరీక్షల నిర్వహణ సవాలుగా మారింది. వీటిని నిర్వహించేందుకు ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ఓపెన్‌ బుక్‌ టెస్ట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌ యూనివర్సిటీ మరో ముందడుగు వేసింది. అక్టోబర్‌ 1 నుంచి జరిగే ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వీటికోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ పరీక్షలకు 78వేల మంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు హాజరవుతారని యూనివర్సిటీ వెల్లడించింది.

అయితే, ఆన్‌లైన్‌ పరీక్షలో యాభై బహుళ ఎంపిక ప్రశ్నలను ఇస్తారు. వీటిలో విద్యార్థులు 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి 18వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించి లక్షా 82వేల ప్రశ్నలను రూపొందించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. పరీక్షలకు ముందస్తుగా సిద్ధం అయ్యేందుకు కూడా విద్యార్థులు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని