మా దేశానికి వ్యాక్సిన్లు అందించండి

తమ దేశ జనాభాలో 20శాతం మందికి వ్యాక్సిన్లు సమకూర్చాలని నేపాల్‌ భారత్‌ను కోరింది. కరోనా వైరస్‌ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌ తమ దేశానికి వ్యాక్సిన్లను సేకరించే ప్రక్రియను తీవ్రం చేసింది.

Updated : 02 Feb 2024 16:27 IST

భారత్‌ను కోరిన నేపాల్‌

కాఠ్‌మాండూ: తమ దేశ జనాభాలో 20శాతం మందికి వ్యాక్సిన్లు సమకూర్చాలని నేపాల్‌ భారత్‌ను కోరింది. కరోనా వైరస్‌ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌ తమ దేశానికి వ్యాక్సిన్లను సేకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు నేపాల్‌ ప్రభుత్వం భారత్‌కు ఓ లేఖ రాసింది. భారత్‌లో ఇప్పటికే ఆక్స్‌ఫోర్డ్‌ ఆస్ట్రాజెనెకా, భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరిదశ ప్రయోగ పరీక్షల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న ఇతర దేశాలకు కూడా నేపాల్‌ తన అభ్యర్థనను పంపింది. ఈ మేరకు నేపాల్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సలహా కమిటీ సమన్వయకర్త డాక్టర్‌ శ్యామ్‌రాజ్‌ ఉప్రేతి తెలిపారు. గత నెలలో నేపాల్‌ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ నేపాల్‌ ప్రజలకు వ్యాక్సిన్‌ అందజేయటంపై సంసిద్ధత వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో జరిగే కొవాక్స్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అన్ని దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఇతర దేశాల్లో తయారైన వ్యాక్సిన్లను అనుమతించేందుకు చట్టాల్లో మార్పులకు ఆర్డినెన్సును ఆమోదించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక దాని వినియోగంపై ఇప్పటికే ప్రాధాన్యతా క్రమాల్ని నేపాల్‌ రూపొందించింది.

ఇవీ చదవండి..

క్వారంటైన్‌లో 361మంది ప్రయాణికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు