వాషింగ్టన్‌కు వెళ్లి.. విడిచిన దుస్తులు ఉతికించుకొని!

అమెరికా పర్యటనకు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరించే తీరుపై అమెరికన్‌ మీడియాలో ఓ కథనం వెలువడింది. ఆయన పర్యటించిన ప్రతిసారీ బ్యాగుల కొద్దీ ఉతకని దుస్తులు తీసుకొస్తారన్నది.....

Updated : 25 Sep 2020 17:51 IST

వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరించే తీరుపై అమెరికన్‌ మీడియాలో ఓ కథనం వెలువడింది. ఆయన పర్యటించిన ప్రతిసారీ బ్యాగుల కొద్దీ ఉతకని దుస్తులు తీసుకొస్తారన్నది ఆ కథనం సారాంశం. ఆ దుస్తులను అమెరికా ప్రభుత్వంలోని పనివారితో ఉతికించుకునేందుకు ఇలా చేస్తుంటారని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. దీంతో నెతన్యాహు శైలి చర్చనీయాంశమైంది.

బెంజమిన్ అమెరికాలో అధికారికంగా పర్యటించిన ప్రతిసారీ వైట్‌హౌస్‌కు చెందిన అధికారిక అతిథి భవనమైన బ్లెయిర్ హౌస్‌లో సేదతీరుతుంటారు. ఆ క్రమంలో ఆయన వెంట బ్యాగులు, సూటుకేసుల కొద్దీ విడిచిన దుస్తులను తీసుకువస్తారు. వాటిని అక్కడి సిబ్బంది ఉచితంగా శుభ్రం చేసిపెడతారు. తన అతిథులందరికీ బ్లెయిర్ హౌస్‌ ఉచితంగా లాండ్రీ సేవలు అందిస్తుండంతో ఆయన ఈ సౌలభ్యాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. చాలామంది విదేశీ నేతలు ఈ సేవలను సహేతుకమైన రీతిలోనే వినియోగించుకున్నప్పటికీ.. ఒక్క నెతన్యాహు మాత్రమే సూట్‌కేసుల కొద్దీ దుస్తులను తీసుకొస్తారని అధికారులు వెల్లడించినట్లు సదరు కథనంలో పేర్కొంది. అనేకమార్లు ఆయన తీరు ఇలాగే ఉండటంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదేనని గుర్తించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కొట్టిపారేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని