ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది...

Updated : 17 Jul 2020 12:21 IST

అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని రమేశ్‌కుమార్‌కు సూచించింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ను కోరాలని ఆదేశించింది.

గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటికే సమయం కోరామని రమేష్‌ కుమార్‌ తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈకేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని