మాస్కు ధరించకుంటే వ్యాసం రాయాల్సిందే..

కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాస్కు ధరించని వారిని అరెస్టు చేసి వారిని జైలుకు తరలించి...

Published : 07 Dec 2020 14:16 IST

గ్వాలియర్‌: కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాస్కు ధరించని వారిని అరెస్టు చేసి వారిని జైలుకు తరలించి వారితో వ్యాసాలు రాయించనున్నారు. కొవిడ్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలపై వ్యాసం రాయాల్సి ఉంటుంది.

మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు గ్వాలియర్‌లో ‘రోకో-టోకో’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ కౌశ్లేంద్ర విక్రమ్‌సింగ్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు కరోనా నియమనిబంధనలను ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా మాస్కు ధరించకుండా కనిపిస్తే వారిని బహిరంగ జైలుకు తరలించనున్నారు. అక్కడ వారికి కరోనా పట్ల అవగాహన కల్పించి కొవిడ్‌పై వ్యాసం రాయించనున్నారు. ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసి వారిని రూప్‌సింగ్‌ స్టేడియానికి తరలించి వ్యాసాలు రాయించినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇవీ చదవండి..

వధువుకు కరోనా.. ఏం చేశారంటే..

పుణెలో స్పుత్నిక్‌ టీకా ప్రయోగాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని