నవంబరు... తుపాన్ల మాసం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రతిసారీ... రాష్ట్రంలోని 974 కి.మీ. తీరప్రాంతం అల్లాడుతోంది. 1891 నుంచి ఇప్పటి వరకు 75 తుపాన్లు ఏపీని తాకాయి. నవంబరులో తుపాను అంటే... 1977 నాటి దివిసీమ ఉప్పెనే గుర్తుకొస్తోంది.

Updated : 26 Nov 2020 11:59 IST

దివిసీమ ఉప్పెన గుర్తొస్తే వెన్నులో వణుకు

 

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రతిసారీ... రాష్ట్రంలోని 974 కి.మీ. తీరప్రాంతం అల్లాడుతోంది. 1891 నుంచి ఇప్పటి వరకు 75 తుపాన్లు ఏపీని తాకాయి. నవంబరులో తుపాను అంటే... 1977 నాటి దివిసీమ ఉప్పెనే గుర్తుకొస్తోంది. అప్పట్లో అంచనాకు అందని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించాయి. తర్వాత వచ్చిన తుపాన్ల్లు భారీ నష్టాన్నే మిగిల్చాయి. గత 130 ఏళ్లలో 75 తుపానులు రాగా  నవంబరులోనే 23 సంభవించాయి. వీటిలో 10 నెల్లూరులో, 8 కృష్ణాలో తీరందాటి విలయం సృష్టించాయి. 

1977
కృష్ణా జిల్లాలో నవంబరులో తీరం దాటిన పెను తుపాను.. దివిసీమలో ఊళ్లకు ఊళ్లనే తుడిచి పెట్టేసింది. 24లక్షల మందిపై ప్రభావం చూపింది.10వేల మందికిపైగా చనిపోయారు. 10 లక్షల ఇళ్లు దెబ్బతినగా 34 లక్షల ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. 2.50 లక్షల పశువులు చనిపోయాయి.  రూ.172 కోట్ల నష్టంగా అంచనా వేశారు.

1987
1987 నవంబరులోనే వచ్చిన తుపానుతో 10 జిల్లాల్లో 119మంది  చనిపోగా... లక్ష ఇళ్లు దెబ్బతిన్నాయి. 24 లక్షల ఎకరాల పంటలు దెబ్బ   తిన్నాయి. నష్టం రూ.126 కోట్లు.

1996
1996 నవంబరులో నాలుగు జిల్లాలను కకావికలం చేసిన తీవ్ర తుపాను... 1,077 మందిని బలితీసుకుంది. ఆరు లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతినగా 12.50 లక్షల  ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రూ.6,129.25 కోట్ల నష్టం సంభవించింది.

2012
2008(ఖైముక్‌), 2010(జల్‌) తుపాన్ల ప్రభావం రాష్ట్రంపై భారీగా పడింది. 2012 నవంబరులో ఏర్పడిన తీవ్ర తుపాను నీలం... 30 మంది మృతికి కారణమైంది. 17.50లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.1,710 కోట్ల నష్టం జరిగింది. 

2013 
2013 నవంబరులో రెండు తుపాన్లు రాష్ట్రాన్ని   వణికించాయి. హెలెన్‌... పది జిల్లాల్లోని 7.13 లక్షల మందిపై ప్రభావం చూపింది. 9మంది చనిపోయారు. 7,499 ఇళ్లు దెబ్బతిన్నాయి. రూ.620 కోట్ల నష్టం తలెత్తింది. ఆ వెంటనే వచ్చిన లెహర్‌ సైతం భారీ నష్టానికి కారణమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని