కరోనా ఎఫెక్ట్‌: ఒడిశాలో సిలబస్‌ కుదింపు

కరోనా వైరస్‌ వ్యాప్తి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యా సంస్థలు తెరచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశముండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఈక్రమంలోనే ఒడిశా ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు...

Published : 25 Aug 2020 02:28 IST

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యా సంస్థలు తెరచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశముండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒడిశా ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేసి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమిర్‌ రంజన్‌ దాస్‌ వెల్లడించారు. ఈ అంశంపై కసరత్తు జరుగుతోందని, ఎంతమేర సిలబస్‌ను తగ్గించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పాఠశాలలు ఆగస్టు 31 వరకు తెరచుకోబోవని మంత్రి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లోనూ ఇదే రకమైన పరిస్థితులు కొనసాగే అవకాశముందన్నారు. సిలబస్‌ను ఎంతమేర తగ్గించాలన్న అంశం.. పాఠశాలలు ఎప్పుడు తిరిగి తెరచుకుంటాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్‌ఈ సిలబస్‌లోనూ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తొమ్మిదోతరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సిలబస్‌ను తగ్గిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని