INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

Published : 10 Sep 2020 19:38 IST

భలే ఉందే.. సీతాకోకచిలుక ఆకారంలో మాస్క్‌ అనుకుంటున్నారా? అదీ నిజమైన సీతాకోకచిలుక. జర్మనీ లూథర్‌స్టాడ్ విట్టెన్‌బర్గ్‌లోని సీతాకోకచిలుకల పార్కు చూసేందుకు వచ్చిన సందర్శకురాలి మాస్క్‌పై ఓ సీతాకోకచిలుక వచ్చి వాలింది. దీన్ని చూసిన వారికి సరికొత్తగా మాస్క్‌ డిజైన్‌ చేశారనిపిస్తుంది. 


అమెరి​కాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావం శాన్‌ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంపై పడింది. అగ్నికీలల నుంచి వెలువడిన దట్టమైన పొగ కారణంగా ఆకాశం నారింజ రంగులోకి మారింది. ఉదయం 11 గంటలైనా శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ వంతెన వద్ద వీధి దీపాలు వెలుగుతున్న దృశ్యం.


హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఎంసెట్‌ పరీక్షా కేంద్ర వద్ద తమ పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు. కొవిడ్‌ కారణంగా నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి వస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోని వెళ్లిన తర్వాత ఎలా రాస్తారో అని కొందరు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కనిపించారు.


హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైండ్‌నెస్‌ రూంలో తన పిల్లలకు సరిపోయే బట్టలను వెతుకుతున్న మహిళ. 


చిత్రంలో మీకు కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజ్జి. సంచార జాతికి చెందిన బుజ్జి బతుకుదెరువు కోసం  తమిళనాడు నుంచి గుంటూరు వచ్చాడు.  పొన్నూరులో గతవారం ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స చేయించేందుకు కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ప్రాథమిక వైద్యం చేసిన సిబ్బంది ఆ తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బులు లేక కుటుంబంతో సహా చెన్నై వెళ్లారు. 


సెల్‌టవర్‌పై ఉన్న పక్షి పేరు నల్లకొంగ. సాధారణంగా జనవాసాలకు దూరంగా పెద్ద వృక్షాలపైనే గూడు కడతాయి. కర్నూలు సంకల్‌బాగ్‌ ప్రాంతంలో ఇలా సెల్‌టవర్‌పై గూడు నిర్మించుకున్నాయి. నల్లకొంగలు జనావాసాల మధ్య గూడు కట్టడం అరుదని పక్షి ప్రేమికులు పేర్కొన్నారు.


హైదరాబాద్‌లో గురువారం వర్షం కురిసింది. వాన నుంచి రక్షణగా పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ కింద వేచి ఉన్న వాహనదారులు. 


ట్రాఫిక్‌, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సిగ్నల్‌ వద్ద వేచి చూస్తున్న వాహదారులు. దాదాపుగా వాహనదారులందరూ హెల్మెట్‌, మాస్క్‌ ధరించి కనిపించారు. హైదరాబాద్‌లోని సచివాలయం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద తీసిన చిత్రమిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని