వ్యాక్సిన్‌ రాగానే కరోనా పోతుంది

మరో రెండు, మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్ననేపథ్యంలో వ్యాక్సిన్‌ రాగానే దేశంలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుందని కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలే తెలిపారు.

Published : 21 Dec 2020 22:32 IST

కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే

పనాజీ: మరో రెండు, మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్ననేపథ్యంలో వ్యాక్సిన్‌ రాగానే దేశంలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుందని కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలే తెలిపారు. సోమవారం గోవా రాజధాని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కరోనా వైరస్‌ ఉంటే మరో ఆరునెలలు దేశంలో ఉండొచ్చేమో కానీ, ఒక్కసారి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే కరోనా ఇక ఇక్కడ కనిపించదు.’’ అని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ‘గో కరోనా గో’ అనే నినాదాన్ని వినిపించారు.  ఈ నినాదాన్ని ఆయన పేర్కొంటూ.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన తెలిపారు. గోవా, మహారాష్ట్రల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు ఫైజర్‌, భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు తయారుచేసిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతినిమ్మంటూ సదరు కంపెనీలు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి.

ఇవీ చదవండి..

కొత్త రకం కరోనాపై WHO ఏమందంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని