24గంటల్లో 3,20,000 కొవిడ్‌ టెస్టులు! ఐసీఎంఆర్‌

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడం అనివార్యమయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నిత్యం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఎక్కువ మొత్తంలో చేపడుతున్నాయి. దీనిలోభాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,20,161 శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఒకేరోజు ఈ స్థాయిలో పరీక్షలు చేపట్టడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు కోటి 24లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Published : 15 Jul 2020 13:48 IST

దేశంలో కోటి 24లక్షల శాంపిళ్లకు కరోనా టెస్ట్‌లు పూర్తి
భారత వైద్య పరిశోధన మండలి వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడం అనివార్యమయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నిత్యం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఎక్కువ మొత్తంలో చేపడుతున్నాయి. దీనిలోభాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,20,161 శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఒకేరోజు ఈ స్థాయిలో పరీక్షలు చేపట్టడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు 1,24,12,664 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్రాల సంఖ్యనూ పెంచుతోంది. మార్చి తొలివారంలో దేశంలో వంద కరోనా నిర్ధారణ కేంద్రాలుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 1226కు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 865 ప్రభుత్వ కేంద్రాలు ఉండగా మరో 358 కేంద్రాలు ప్రైవేటు నిర్వహణలో ఉన్నాయి. ఆర్‌టీ-పీసీఆర్‌ 633, ట్రూనాట్‌ 491, సీబీనాట్ 99 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు భారీ స్థాయిలో పరీక్షలు చేపడుతున్నాయి. 

అమెరికాలో 4.5కోట్ల టెస్టులు..

ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను అమెరికా చేపడుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. ఇప్పటివరకు అమెరికాలో నాలుగున్నర కోట్ల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ట్రంప్‌ వెల్లడించారు. దీంతో అమెరికాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 34లక్షలకు చేరినట్లు తెలిపారు. అమెరికా చేస్తున్నట్లుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తే చైనా, బ్రెజిల్‌, రష్యా, భారత్‌ దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని మరోసారి ట్రంప్‌ అన్నారు. బ్రెజిల్‌లో వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ట్రంప్‌ అభిప్రాయపడ్దారు.

ఇవీ చదవండి..
కరోనాపై ప్లాస్మా బాణం..!
ఆ విషయంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని