పోలవరం పనులు పరిశీలించిన ప్రాజెక్టు అథారిటీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిశీలించింది. తొలుత ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని..

Published : 21 Dec 2020 01:21 IST

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిశీలించింది. తొలుత ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృందానికి ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్యులు ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే క్రస్ట్‌ గేట్ల అమరిక పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇంజినీర్లు పీపీఏ బృందానికి వివరించారు. పీపీఏ బృందం మరో రెండు రోజులపాటు పోలవరంలో పర్యటించి వివిధ అంశాలపై పరిశీలన జరపనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని