మేడపైన వరిసాగు..బాగు..బాగు..

పట్టణాల్లో సాధారణంగా ఇంటి మీద కూరగాయలు, పూల మొక్కలు పెంచటం మీరు చూసే ఉంటారు. కానీ..వరి పంటను సాగు చేయటం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా?

Published : 02 Nov 2020 23:12 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  సాధారణంగా ఇంటి మీద కూరగాయలు, పూల మొక్కలు పెంచటం మీరు చూసే ఉంటారు. కానీ..వరి పంటను సాగు చేయటం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా? ...ఇంటిమీదా? వరి పంటా? అదేంటి? అని విడ్డూరంగా అనిపిస్తోంది కదా! కానీ..ఓ వ్యక్తి నిజంగానే మేడ మీద వరి పండిస్తున్నాడు. సేద్యంపై ఉన్న మక్కువతో ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు. వరి సాగుతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అదికూడా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో. ఇంతకీ అతడెవరు? అ కథేంటీ? ఓ సారి చూసేద్దాం మరి... 

మహారాష్ట్ర, కోల్హపుర్‌ పరిధిలోని కజ్బా బావ్‌డాకు చెందిన సుధాకర్‌ పాటిల్‌ ఓ బ్యాంకులో ఉద్యోగి. ఆయనకు వ్యవసాయం చేయటమంటే ఎంతో ఇష్టం. లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ఆలోచనతో ఇంటివద్దే వరిపంటను సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. టెర్రస్ పై ప్లాస్టిక్‌ డబ్బాలను ఉంచి అందులో వరి పంటను వేశాడు. దానితో పాటు పండ్లు, కూరగాయలు, పసుపు, తృణధాన్యాలు, మిరియాలు తదితరాలను సాగు చేశాడు. ఈ పంటలను పండించటంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతులు పాటిస్తున్నట్లు ఆయన వివరించాడు. ఈ ధాన్యం కొన్నినెలల పాటు తన కుటుంబానికి సరిపోతుందని పేర్కొన్నాడు. భలే ఆలోచన కదూ...వ్యవసాయం మీద మక్కువ ఉంటే చాలు ఉన్న స్థలంలోనే పంటలు పండించొచ్చని నిరూపిస్తున్న పాటిల్‌ అందిరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు.

 

 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని