అమరావతిపై పరకాల ప్రభాకర్‌ డాక్యుమెంటరీ

రాజధాని ఎక్కడుందో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 07 Dec 2020 01:06 IST

ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శన

హైదరాబాద్‌: రాజధాని ఎక్కడుందో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్దాల తరబడి రాజధాని కోసం అన్వేషణలే తప్ప ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు ఆలోచించడం లేదన్నారు. ‘రాజధాని విషాదం-అమరావతి’ పేరుతో పరకాల ప్రభాకర్‌ రూపొందించిన 60 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని హైదరాబాద్‌లో ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శించారు. రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత పాలకుల మధ్య నెలకొన్న వివాదాలు, భూములిచ్చిన రైతుల ఆర్తనాదాలు, మూడు రాజధానులపై దక్షిణాఫ్రికా సమీక్షలను ప్రస్తావిస్తూ పరకాల ప్రభాకర్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. రాజధానిపై సమగ్రమైన అధ్యయనం, సరైన పరిష్కారం కోసమే ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు పరకాల తెలిపారు. వచ్చేవారం దీన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. డాక్యుమెంటరీని పలువురు మేధావులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు వీక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని