ఆకలి తీర్చలేక..‘అమ్మ’ ఓడిపోయింది

మహమ్మారి కరోనా బంధాలను దూరం చేస్తోంది. వైరస్‌ సోకిందని కన్న తల్లినే ఓ కొడుకు వదిలించుకోవడానికి ప్రయత్నించిన ఘటన మరువక ముందే..

Published : 25 Jul 2020 17:48 IST

అనంతపురం: మహమ్మారి కరోనా బంధాలను దూరం చేస్తోంది. వైరస్‌ సోకిందని కన్న తల్లినే ఓ కొడుకు వదిలించుకోవడానికి ప్రయత్నించిన ఘటన మరువక ముందే.. బిడ్డ ఆకలి తీర్చలేక ఓ చిన్నారిని కన్న తల్లే అమ్మేసింది. ఈ దయనీయ ఘటన అనంతపురం జిల్లా బుచ్చర్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సునీతమ్మ 8 నెలల కిందట ఆడ శిశువుకు జన్మనిచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా పనులు లేకపోడంతో కుటుంబమంతా పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆ దంపతులు యాచకులకు చిన్నారిని అమ్మేశారు. గమనించిన గ్రామస్థులు వారి నుంచి శిశువును తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న సబ్‌కలెక్టర్‌ హరిప్రసాద్‌ బాధితులకు సాయమందించారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని