JK అధికారిక భాషల బిల్లుకు ఆమోదం 

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము-కశ్మీర్‌ అధికారిక భాషల బిల్లు- 2020 కు బుధవారం పార్లమెంట్‌ ఆమోదం

Published : 24 Sep 2020 00:57 IST

                                                                                                     

న్యూదిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము-కశ్మీర్‌ అధికారిక భాషల బిల్లు- 2020 కు బుధవారం పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో కశ్మీరి, డోగ్రీ, హిందీలను అధికారిక భాషలుగా పేర్కొన్న బిల్లు ఉర్దూ, ఆంగ్లాన్ని వాటికి అదనంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లో 76 శాతం మంది ప్రజలు కశ్మీరీ, డోగ్రీ భాషలు మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. 2011 లెక్కల ప్రకారం 0.16 శాతం మంది ఉర్దూను, 2.3 శాతం మంది ప్రజలు హిందీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు స్థానికంగా కొందరు మాట్లాడే భాషలైన పంజాబీ,  పహరీలను అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని