ఈ పెంగ్విన్ల జంట.. చూడ ముచ్చటంట..!

రెండు  పెంగ్విన్లు ఒకచోట చేరి నాకు నువ్వు..నీకు నేను అన్నట్లుగా ఒకదానిపై మరొకటి చేయి వేసుకొని సాంత్వన పొందుతున్నఓ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ప్రత్యేకంగా నిలిచిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలరిస్తున్నాయి.

Updated : 24 Nov 2022 16:11 IST

సిడ్నీ: రెండు ఒంటరి పెంగ్విన్లు ఒకచోట చేరి నాకు నువ్వు.. నీకు నేను అన్నట్లుగా ఒకదానిపై మరొకటి చేయి వేసుకొని సాంత్వన పొందుతున్న ఓ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలరిస్తున్నాయి. జర్మన్‌కు చెందిన టోబియాస్‌ బామ్‌గార్ట్నర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ జంట పెంగ్విన్లను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చిత్రించాడు. ఈ ఫొటో ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు ఓషియోనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే కమ్యూనిటీ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది.

కాగా.. ఈ రెండు పెంగ్విన్లు కొంతకాలం కిందట తమ భాగస్వాములను కోల్పోయాయని, ఆ తర్వాత ఈ రెండూ సమీపంలోని లైట్లను చూస్తూ ఒకచోట చేరాయని సదరు ఫొటోగ్రాఫర్‌ తెలిపారు. ఈ మధ్య ఒక వాలంటీర్ తనను కలిసి ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆడ వైట్ పెంగ్విన్ ఇటీవలే తన భాగస్వామిని కోల్పోయిందని, అలాగే దాని పక్కనున్న పెంగ్విన్ కూడా తన భాగస్వామిని కోల్పోయిందని చెప్పారన్నారు.  మెల్‌బోర్న్‌లోని సెయింట్‌ కిల్డా పీర్‌ అనే బీచ్ ‌దాదాపు 14 వందల రకాల పెంగ్విన్లకు నిలయం. ప్రస్తుతం ఈ పెంగ్విన్లు జంటగా ఉన్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో కామెంట్లను జత చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని