ఉస్మానియా సైట్‌ప్లాన్‌ సమర్పించండి: హైకోర్టు

ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి గూగుల్‌ మ్యాప్‌లను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి అంశంలో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌...

Published : 31 Aug 2020 17:27 IST

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన సైట్‌ ప్లాన్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి అంశంలో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందంటూ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పురాతన వారసత్వ సంపదగా ఉన్న ఉస్మానియా భవనాన్ని మాత్రం కూల్చవద్దని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సత్యం రెడ్డి, రచనా రెడ్డి కోర్టులో వాదించారు. కొత్త ఆస్పత్రి నిర్మాణానికి తాము అభ్యంతరం చెప్పడంలేదని.. అయితే చారిత్రక భవనం కూల్చకుండా పక్కన ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించవచ్చనే అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రపంచంలో ఎక్కడైనా చారిత్రక, వారసత్వ భవనాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారా? అని ఆరా తీసింది. ఉస్మానియా ఆస్పత్రి స్థలం, భవనానికి సంబంధించిన చిత్రాలను సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని