రేణిగుంటలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం

రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపై త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌వేపై పరిశీలనకు వెళ్లిన ఫైర్‌ ఇంజిన్‌ బోల్తా

Published : 20 Jul 2020 01:53 IST

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపై త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌వేపై పరిశీలనకు వెళ్లిన ఫైర్‌ ఇంజిన్‌ బోల్తా పడింది. దీనిని గుర్తించిన బెంగళూరు-తిరుపతి విమాన పైలట్‌ విమానాన్ని ల్యాండ్‌ చేయలేదు. విమానం తిరిగి బెంగళూరుకు తిరుగు పయనమైంది. పెను ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వేపై ఉన్న ఫైర్‌ ఇంజన్‌ తరలింపు పనులను వేగవంతం చేశారు. దీంతోవిమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వకుండా విమానాలు వెనక్కి వెళ్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని