భర్తపై బాలీవుడ్‌ నటి పోలీసులకు ఫిర్యాదు.. 

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే పోలీసులను ఆశ్రయించారు. తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో

Published : 23 Sep 2020 19:02 IST

పెళ్లైన 13 రోజులకే.. 
భర్త అరెస్టు.. బెయిల్‌పై విడుదల 

పనాజి : బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే పోలీసులను ఆశ్రయించారు. తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని వారికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామ్‌ అహమ్మద్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు పూనమ్ జులైలో ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాలు చూపిస్తూ సామాజిక మధ్యమాల్లో ఫోటోలు పోస్టు చేశారు. అనంతరం సెప్టెంబరు 10న వివాహం చేసుకున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. వివాహానికి సంబంధించిన ఫోటోలను సైతం సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పెళ్లైన 13 రోజుల్లోనే.. విహారయాత్రలో ఉండగానే తన భర్త తనను కొడుతున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని నటి గోవా పోలీసులను ఆశ్రయించటం చర్చనీయాంశమైంది. పూనమ్‌పాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం శ్యామ్‌ను అరెస్టు చేశారు. రూ.20వేల పూచీకత్తుపై స్థానిక కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.  

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts