అయ్యప్ప భక్తుల కోసమే..ఆ పోస్టాఫీసు

కేరళ అయ్యప్ప సన్నిధిలో ఉన్న తపాలా కార్యాలయం భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. స్వయంగా శబరిగిరులను సందర్శించలేని భక్తులు బుక్ చేసుకుంటే... నేరుగా ఇంటికే ప్రసాదాన్ని చేరవేస్తుంది. అంతేకాదు ఈ కార్యాలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Published : 30 Nov 2020 00:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కేరళ అయ్యప్ప సన్నిధిలో ఉన్న తపాలా కార్యాలయం భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. స్వయంగా శబరిగిరులను సందర్శించలేని భక్తులకు నేరుగా ఇంటికే ప్రసాదాన్ని చేరవేస్తుంది. అంతేకాదు ఈ కార్యాలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విషయాలేంటో మనమూ తెలుసుకుందామా?

ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌...

ఈ పోస్టాఫీసు 1963లో అందుబాటులోకి వచ్చింది. పథానతిట్టం పరిధిలో ఉన్న ఈ కార్యాలయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదిలో మూడు నెలలు మాత్రమే (మండల దీక్షల సమయంలో) తెరిచి ఉంటుంది. ఈ ఆఫీసుకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ ఉంది. ఇతర వాటితో పోలిస్తే..ఇక్కడి ఆఫీసులో ఉండే పోస్టల్‌ సీల్‌ భిన్నంగా ఉంటుంది. దానిపై అయ్యప్ప చిత్రాలు, పద్దెనిమిది బంగారపు మెట్ల గుర్తులు ఉంటాయి. అయ్యప్ప చిత్రం ఉన్న స్టాంపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మండల దీక్షలు ముగిసిన అనంతరం పోస్టాఫీసు మూసివేసినపుడు మిగిలిన అయ్యప్ప చిత్రాలను అత్యంత భద్రంగా ఉంచుతారు.  

భక్తుల ఇంటికే ప్రసాదం...

శబరీశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులకు పోస్టుకార్డులు పంపుతుంటారు. ఎంతోమంది .. వివాహ, గృహ తదితర ఎన్నో ఆహ్వాన పత్రికలను అయ్యప్పకు పంపిస్తారు. వాటిని సన్నిధికి చేర్చే బాధ్యత ఈ కార్యాలయానిదే. ఈ ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి రాలేని భక్తుల కోసం ఈ పోస్టాఫీసు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. దేశంలోని ఏ తపాలా కార్యాలయం నుంచైనా నగదు పంపిస్తే..స్వామి వారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటికే చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు