గోవులను రక్షించండి: ప్రియాంక గాంధీ 

: ఉత్తరప్రదేశ్‌లో గోవుల పరిస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంరక్షణకు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌నకు ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా ఇటీవల ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఫొటోలను చూసి ఆమె చలించిపోయారు.

Published : 21 Dec 2020 23:36 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో గోవుల పరిస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంరక్షణకు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె లేఖ రాశారు. ఇటీవల ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఫొటోలను చూసి ఆమె చలించిపోయారు. ల‌లిత్‌పూర్‌లో ఆవుల‌ క‌ళేబరాలు క‌నిపించ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. ‘అవి స‌రైన ఆహారం, నీరు లేక మృత్యువాత ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇలాంటి ఫొటోలు బయటికి రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ రాష్ట్రంలో ఆవుల దుస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టేలా ఎన్నోదృశ్యాలు క‌నిపించాయి. వాటిని సంర‌క్షించ‌డానికి సరైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది’అని యోగికి రాసిన లేఖ‌తోపాటు ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ ప్రియాంకా ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం గోశాల‌లు ప్రారంభించినా.. వాటిలో వసతులు చాలా దారుణంగా ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ‘గో-ధ‌న్ న్యాయ్ యోజ‌న‌’ను ప్రారంభించార‌ని, యోగి ప్ర‌భుత్వం కూడా ఆ ప‌థకాన్ని యూపీలో అమ‌లు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని