మాస్కులు పెట్టుకోకపోతే.. అక్కడ శిక్ష ఏంటంటే?

కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు మాస్క్‌లు, భౌతిక దూరం, వైద్యుల సలహాలే శ్రీరామ రక్ష.

Published : 15 Sep 2020 17:33 IST

జకార్తా: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు మాస్క్‌లు, భౌతిక దూరం, వైద్యుల సలహాలే శ్రీరామ రక్ష. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం ఈ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరిగే వారికి ఇండొనేషియాలోని జావా ద్వీపంలోని అధికారులు కొత్తరకం శిక్ష విధించారు.  గాబెటన్‌ గ్రామంలోని శ్మశానవాటికలో కరోనా మృతుల కోసం సమాధులు తవ్వాలని ఆదేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ‘ప్రస్తుతం మా వద్ద సమాధులు తవ్వేందుకు ముగ్గురు వ్యక్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరికి ఇది తగిన శిక్ష అని భావించాను’ అని జావా ద్వీపంలోని సెర్మె జిల్లా పాలనాధికారి సుయానో వెల్లడించారు. ఇది నిబంధనలను ఉల్లంఘించే వారి విషయంలో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెర్మెలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, అధిక  జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన ఇండొనేషియాలో కొద్ది రోజులుగా  నిత్యం మూడువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 2,18,382 మందికి కరోనా సోకగా..8,723 మంది మృత్యువాత పడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు