తిరుమలలో వైభవంగా పుష్పయాగం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి..

Updated : 21 Nov 2020 19:02 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేయనున్నారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను తితిదే సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తితిదే ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తితిదే రద్దుచేసింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని