
Published : 09 Oct 2020 18:34 IST
విజయవాడ చేరుకున్న మోహన్ భగవత్
విజయవాడ: రేపటి నుంచి గుంటూరు నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో నిర్వహించనున్న ఆర్ఎస్‌ఎస్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ చేరుకున్నారు. ఏపీ ప్రాంత, విభాగ ప్రచారక్ బైఠక్‌లో మోహన్ భగవత్ పాల్గొంటారు. విమానాశ్రయంలో భాజపా నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
Tags :