చుక్కనీరు తొణకకుండా.. సాఫీగా రైలుప్రయాణం!

ట్రాక్‌ల సంరక్షణకు రైల్వే శాఖ ఎంతో కృషి చేస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ రైల్వే ట్రాక్‌ల నిర్వహణ తీరుకు అందులోని దృశ్యమే నిదర్శనమని తెలిపారు. ఆ

Published : 01 Nov 2020 01:20 IST

బెంగళూరు: ట్రాక్‌ల సంరక్షణకు రైల్వే శాఖ ఎంతో కృషి చేస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ రైల్వే ట్రాక్‌ల నిర్వహణ తీరుకు అందులోని దృశ్యమే నిదర్శనమని తెలిపారు. ఆ వీడియోలో మైసూరు, బెంగళూరు మధ్య ట్రాక్‌పై రైలు వేగంగా ప్రయాణిస్తున్న దృశ్యం ఉంటుంది. ఆ రైళ్లో ఓ గాజు గ్లాసులో నిండుగా నీరు ఉన్నప్పటికీ.. ప్రయాణంలో చుక్క నీరు తొణకకుండా ఉన్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు మధ్య రైల్వే ట్రాక్‌ల నిర్వహణ తీరుకు ఫలితమిది. ప్రతిఒక్కరూ దీన్ని చూడండి. రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ.. ఒక చుక్క నీరు కూడా తొణకకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది’అని గోయెల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ట్రాక్‌ నిర్వహణ పనులు 130కిలోమీటర్ల మేర రూ.40కోట్లతో చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని