తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా.. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో

Updated : 20 Sep 2020 23:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా.. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ సమీక్ష

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సీఎం సూచన మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. అవసరమైతే నాలాలు, వరద ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సీఎస్‌ ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని