Updated : 26 Sep 2020 16:12 IST

తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలే..

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, జనగామ, మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. తూర్పు బిహార్‌ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 3.1కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. ఇది రేపు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

అప్రమత్తమైన తెలంగాణ సర్కార్‌ 
మరోవైపు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులంతా హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎస్‌ ఆదేశించారు. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌కు అందించాలన్నారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎస్‌ స్పష్టం చేశారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని