రాజీవ్‌ హత్య కేసు దోషికి పెరోల్‌ పొడిగింపు

సుప్రీంకోర్టు సోమవారం రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి ఏజీ పెరారివలన్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పెరోల్‌ పొడిగించింది.

Updated : 23 Nov 2020 15:49 IST

దిల్లీ:  సుప్రీంకోర్టు సోమవారం రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి ఏజీ పెరారివలన్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పెరోల్‌ పొడిగించింది. దోషి తరపు లాయర్‌ గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌  పెరారివలన్‌ పెరోల్‌ ఈ రోజుతో ముగిసిపోతున్నా, ఇప్పటి వరకూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అతనికి  ఎస్కార్టు అందించనందున వైద్య పరీక్షలు చేయించుకోలేకపోయిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సుప్రీంకోర్టు అతడి పెరోల్‌ కాలాన్ని మరోవారం పొడిగించింది.  అతనికి వైద్యపరీక్షల నిమిత్తం ఎస్కార్టును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 2015 నుంచి అతని  పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న విషయంపై ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ దర్యాప్తు పురోగతిపై స్పందించాలని సీబీఐని కోర్టు  కోరింది. ఇప్పటికే దోషులుగా తేలిన వారితో సహా ఇతర వ్యక్తులపై దర్యాప్తు పరిధి ఉన్నందున రిమిజన్‌ పిటిషన్‌ వేసే అవకాశం లేదని సీబీఐ గతవారం కోర్టు ముందు అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2014లో పెరారివలన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ల మరణశిక్షను సుప్రీంకోర్టు జీవితకాల శిక్షగా మార్చింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని