దర్శనాలు ఆపండి: రమణ దీక్షితులు

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విటర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని...

Updated : 18 Jul 2020 10:40 IST

తిరుమల: శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విటర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని తితిదే అధికారులకు సూచించారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని, అర్చకులను సంరక్షించి స్వామివారికి పూజలు ఏకాంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు పని చేస్తున్నారని..వారిలో 15 మంది కొవిడ్‌ బారిన పడినా తితిదే ఈవో, అదనపు ఈవో శ్రీవారి దర్శనాలను ఆపడంలేదని తితిదే ఆగమ సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు గురువారం ట్విటర్‌లో విమర్శించిన విషయం తెలిసిందే.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు