మాటలకందని మహా విషాదం: రామోజీరావు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Published : 26 Sep 2020 01:17 IST

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వేల పాటలు పాడిన మధుర గాయకుడి మరణం మాటలకందని మహా విషాదమని అన్నారు. ప్రపంచ సంగీతానికే బాలు స్వరం ఓ వరమని అభివర్ణించారు.

‘‘బాలు ఇక లేరంటేనే బాధగా దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు..ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం’’ అని రామోజీరావు నివాళులర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని