తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు...

Published : 07 Sep 2020 13:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు సీనియర్‌ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని