చలికాలంలో కీళ్ల నొప్పులా.. ఇలా చేయండి..!

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓ వైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బందిపెడతాయి. ఓ పట్టాన పైకి లేవని పరిస్థితి తలెత్తుతుంది. కీళ్లు బిగుసుకుపోవటం వల్ల ఉదయం పూట మంచం దిగటం కూడా కష్టంగా మారుతుంది.

Published : 13 Dec 2020 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓ వైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెడతాయి. ఓ పట్టాన పైకి లేవలేని పరిస్థితి తలెత్తుతుంది. కీళ్లు బిగుసుకుపోవటం వల్ల ఉదయం మంచం దిగటం కూడా కష్టంగా మారుతుంది. అయితే సీజన్‌ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కీళ్ల నొప్పుల బాధ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చు.

కీళ్ల కదలికలను కట్టిపడేసే సమస్య నుంచి ఉపశమనం కోసం శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుకను తీసుకుని కొద్దిగా వేడి చేసి, బట్టలో చుట్టి, నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయటం వల్ల కీళ్ల కదలికలు మృదువుగా మారతాయి. అంతేకాదు పోటెత్తే నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గోరు వెచ్చని నీటితో పాటు, చల్లటి నీటితో కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి పడుకునే సమయంలో మోకీళ్ల చుట్టూ క్రేప్‌ బ్యాండేజ్‌ చుట్టటం లేదా దిండును గానీ, టవల్‌ను గానీ ఉండలా చుట్టి మోకాళ్ల కింద పెట్టుకుంటే మంచిది.
నొప్పులు మరీ త్రీవంగా వేధిస్తున్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు