గ్రేటర్‌లో 43 శాతం పోలింగ్‌: ఎస్‌ఈసీ అంచనా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ అర్ధరాత్రి లేదా బుధవారం ఉదయం తుది...

Updated : 24 Sep 2022 14:38 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ అర్ధరాత్రి లేదా బుధవారం ఉదయం తుది పోలింగ్‌ శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కేవలం 36.73 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఓల్డ్‌ మలక్‌పేటలో గుర్తుల తారుమారుతో పోలింగ్‌ రద్దు అయింది. గురువారం రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక 149 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రీపోలింగ్‌ కారణంగా ఎగ్జిజ్‌పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని