అంగారకుడిపై సరస్సు, కొలనులు!
అంగారక గ్రహం దక్షిణ ధ్రువంపై ఓ పెద్ద సరస్సు దానికి అనుబంధంగా కొలనులు ఉన్నట్లు ఇటలీ శాస్ర్తవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ ధ్రువంలోని అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్లు రెండేళ్ల కిందటే కొనుగొన్న ఈ శాస్ర్తవేత్తలు ప్రస్తుతం
ఇటలీ శాస్ర్తవేత్తల అధ్యయనం..
రోమ్ : అంగారక గ్రహం దక్షిణ ధ్రువంపై ఓ పెద్ద సరస్సు దానికి అనుబంధంగా కొలనులు ఉండే అవకాశం ఉందని ఇటలీ శాస్ర్తవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ ధ్రువంలోని అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్లు రెండేళ్ల కిందటే కొనుగొన్న ఈ శాస్ర్తవేత్తలు ప్రస్తుతం దాన్ని నిర్ధారించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రాడార్ పరికరాల సాయంతో అంగారకుడిపైన ఉన్న వందల మైళ్ల ప్రాంతాన్ని వీళ్లు అధ్యయం చేశారు. దీని ఆధారంగా నీటి జాడపై సమాచారాన్ని సేకరించారు. అంగారకుడి దక్షిణ ధ్రువం అంతర్భాగంలో ఓ ఉప్పు నీటి సరస్సు సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు కనుగొన్నారు. ఉపరితానికి కిలోమీటరు లోతులో మంచు పొరల కింద ఇది ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. దీంతో పాటు మూడు చిన్న కొలనులు ఆ సరస్సుకు అనుబంధంగా ఉన్నట్లు అంచనా వేశారు.
400 కోట్ల సంత్సరాల కిందట అంగరక గ్రహంపైన కూడా భూమిపై ఉన్నట్లు తడి, పొడి వాతావరణం ఉండేది. అనంతరం దాని స్వరూపం పూర్తిగా మారి పొడి వాతావరణంతో నిండిపోయింది. భూఉపరితలానికి లోపల ఉండే నీటి జాడలను కనుగొనేందుకు ఉపయోగించే పద్ధతులతోనే అంగారకుడిపై పరిశోధన చేసినట్లు ఈ అధ్యయనం చేసిన శాస్ర్తవేత్తల బృందం తెలిపింది. నీరు ఉండటంలో జీవజాతి సైతం అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది. దక్షిణధ్రువం ఉపరితలంపై మైనస్ 172 డిగ్రీల ఫారన్‌హీట్ ఉన్నట్లు తెలిపిన అధ్యయనం.. అంతర్భాగానికి వెళ్లే కొద్ది వేడి వాతావరణం ఉంటుందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల