యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది. స్థానిక గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పూర్తి స్థాయి అండదండలతో మణుగూరు నుంచి హైదరాబాద్‌ వైపు నిత్యం ఇసుక

Updated : 03 Sep 2020 12:50 IST

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పూర్తి స్థాయి అండదండలతో మణుగూరు నుంచి హైదరాబాద్‌ వైపు నిత్యం ఇసుక రవాణా చేస్తున్నారు. ఉదయం వేళల్లో ర్యాంపుల నుంచి ఇసుకను తోడి రామానుజవరం, సాంబాయగూడెం, కొండాయిగూడెం, మల్లెపల్లి గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో మణుగూరు నుంచి ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్నారు. దాదాపుగా 1000 లారీలకుపైగా ఇసుక డంప్‌లు గుట్టలుగా పేరుకుపోయాయి. చాలా కాలంగా రూ. కోట్ల ఇసుక అక్రమ దందా సాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రామానుజవరం సర్పంచ్‌ సతీశ్‌ యత్నించారు. గతంలో ఆయనతో ఇసుక వ్యాపారులు బేరసారాలకు దిగారు. కానీ, ఆయన అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఇసుక అక్రమ రవాణాపై సర్పంచ్‌ సతీశ్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని