ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌ ఇదే

రాష్ట్రలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం..

Updated : 29 Oct 2020 16:52 IST

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ నీలం సాహ్ని

అమరావతి: రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఏ తరగతులకు ఎప్పటి నుంచి బోధన ప్రారంభమవుతుందో తెలుపుతూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే పాఠశాలలు తెరవనున్నారు. నవంబర్‌ 2 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బోధన ప్రారంభమవుతుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్‌ 12 నుంచి తరగతులు మొదలవుతాయి. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు.. డిసెంబర్‌ 14 నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని