భారత్‌కు చేరిన మరో మూడు రఫేల్‌ జెట్‌లు

దేశ రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే మరో రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన ఈ అత్యాధునిక.........

Updated : 05 Nov 2020 12:34 IST

దిల్లీ: దేశ రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే మరిన్ని రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. రెండో బ్యాచ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు అంబాలాలోని వైమానిక స్థావరంలో దిగినట్టు భారత వైమానిక దళం ట్విటర్‌లో ప్రకటించింది. జులై 29న ఐదు రఫేల్‌ జెట్‌లు భారత్‌కు రాగా.. ఈ రోజు రాత్రి 8.14 గంటలకు మరో మూడు జెట్‌లు చేరుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌ అమ్ముల పొదిలోకి ప్రవేశించాయి. మొత్తం రూ.59వేల కోట్లతో 36 విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 2023 నాటికి మొత్తం విమానాలు భారత్‌కు చేరతాయని వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ బదౌరియా గతంలో వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని